Friday, December 20, 2024

సురక్షిత ప్రసూతిలో మనమే నెం.1

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ కిట్‌తోనే ఇది సాధ్యం

నూటికి నూరు శాతం ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలోనే జననాలు
ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ 61దేశాల సరసన
తెలంగాణ 89 శాతంతో దేశానికి 122/198 గ్లోబల్ ర్యాంక్
ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన వైద్యారోగ్య మంత్రి హరీశ్

మన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్‌ఎంఐఎస్) నివేదిక ప్రకారం వంద శాతం సంస్థాగత డెలివరీల తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన నుంచి పుట్టిన ప్రతిష్టాత్మక కా ర్యక్రమం కెసిఆర్ కిట్ పథకం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.

ఈ పథకం తెలంగాణను మ రోసారి ప్రపంచ పటంలో నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాత్రమే మా తా శిశు ఆరోగ్య సేవలు క్షేత్రస్థాయి వరకు చేరుకున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో నైపు ణ్యం కలిగిన ఆరోగ్య సిబ్బంది హాజరయ్యే జననాల నిష్పత్తి 89 శాతం మాత్రమే. ఈ జాబితాలోని మొత్తం 198 దేశాల్లో మన దేశం ర్యాంక్ 122. అయితే వంద శాతం సేవలందిస్తున్న ఘన త తెలంగాణకే దక్కింది. ఈ ఘనతను మరో 61 దేశాలు మాత్రమే సాధించాయన్నారు. ఇది ఆరో గ్య తెలంగాణ మోడల్ అని, ఇతర దేశాలతో పో టీ పడి అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News