- Advertisement -
హైదరాబాద్: అవయవ మార్పిడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2022లో మృతుల నుంచి పొందిన అవయవాల మార్పిడిలో తెలంగాణ గణనీయ స్థానంలో నిలిచింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 2765 మంది రోగులకు అవయవాలు అమర్చారు. అందులో అత్యధికంగా తెలంగాణలో 655 అవయవాల మార్పిడి జరిగింది. దేశంలో జరిగిన నాలుగు సర్జరీల్లో ఒకటి తెలంగాణలో కావడం విశేషం. అవయవ మార్పిడిలో తెలంగాణ ప్రభుత్వం గణనీయ చర్యలు తీసుకొంటోంది. జీవన్‌దాన్ కార్యక్రమాన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలో పేద, గొప్ప అన్న తేడా కనబరచడంలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం అవయవ మార్పిడి చికిత్సనందిస్తోంది. ప్రస్తుతం అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిమ్స్ , ఉస్మానియా ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రులకు అధునాతన సౌకర్యాలు కల్పించారు.
- Advertisement -