Monday, December 23, 2024

అభివృద్ధి సూచీలో తెలంగాణ మొదటిస్థానం

- Advertisement -
- Advertisement -

Telangana tops the development index

ఎన్‌ఆర్‌ఐ సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నేతృత్వంలో
టాంజానియాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: అభివృద్ధి సూచీలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఎన్నో త్యాగాలతో సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణగా నిర్మించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ టాంజానియా అధ్యక్షుడు నర్సింహారెడ్డి వంగ తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి శక్తికి తగ్గట్టుగా బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్‌ఆర్‌ఐ సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నేతృత్వంలో, నర్సింహారెడ్డి వంగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి పట్లోల, సురేందర్ సెలం, సూర్య మోహన్ రెడ్డి, మధురెడ్డి, ఎన్‌ఆర్‌ఐ టిఆర్‌ఎస్ టాంజానియా కార్యవర్గ సభ్యులు శ్రీనిలై, చారి గుడికందుల, ప్రణిత్ రెడ్డి, వెంకటేష్, రాజేష్, మహేష్ రెడ్డి, సురేష్, రాజు, పెర్రి, కనిష్క్, శేషులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News