Wednesday, January 22, 2025

మనమే నెంబర్ 1

- Advertisement -
- Advertisement -

స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణకు అగ్రస్థానం

వివిధ
కేటగిరీల్లో
13
అవార్డులు
జిల్లాల
కేటగిరీలో
జగిత్యాలకు
రెండో
స్థానం, ఇందూరుకు
మూడో
స్థానం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని కలికితురాళ్లు చేరా యి. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డు లు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత మిషన్‌లో తెలంగాణ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం గా నిలిచింది. గ్రామీణ స్వచ్ఛభారత్ మి షన్‌లో ఏకంగా తెలంగాణ ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నది. అవార్డులను వచ్చేనెల (అక్టోబర్) 2వ తేదీన స్వ చ్ఛ భారత్ దివస్ సందర్భంగా రాష్ట్రానికి ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి అందజేయనున్నారు. ఈ మేరకు భా రత ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. దేశానికి ఆదర్శ ప్రాయమైన అద్భుత ప్రదర్శన తెలంగాణ రాష్ట్రానిది అంటూ ఆ లేఖలో ప్రశంసలు కురిపించారు.

స్వచ్ఛ సురేక్షణ్ గ్రామీణ (ఎస్‌ఎస్‌జి)లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలువగా, జిల్లాల కేటగిరిలో రెండో స్థానంలో జగిత్యాల, మూడోస్థానంలో నిజామాబాద్ జిల్లాలు నిలిచాయి. అలాగే సౌత్ కేటగిరిలో నిజామాబాద్‌కు రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో ర్యాంకును సాధించింది. ఇక సుజలాం 1.0, సుజలాం 2.0 క్యాంపెయిన్‌లో తెలంగాణ వరుసగా మూడు రెండు స్థానాల్లో నిలిచింది. నేషనల్ ఫిలిమ్ కాంపిటేషన్ కేటగిరీలో తెలంగాణ లోని నూకలంపాడు గ్రామ పంచాయతీ (ఎంకురు మండలం) మూడో ర్యాంక్ సాధించిగా, వాల్ పేయింటింగ్ కాంపిటేషన్ ఒడిఎఫ్ ప్లస్ బయోడీగ్రేడబుల్ వ్యర్ధాలు, గోబర్ ధాన్, ప్లాస్టిక్ వ్య ర్థాలు, మురుగు నీరు, బహిరంగ మల విసర్జన మేనేజ్‌మెంట్ వంటి కేటగిరీల అవార్డులలో రాష్ట్రం సౌత్ జోన్ లో మొదటి ర్యాంకులు సాధించింది.

నిధులు ఇవ్వండి
కాగా రాష్ట్రానికి ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డులతో తెలంగాణ మరోసారి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇందుకు చిత్తశుద్ధితో పనిచేసిన సంబంధిత అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేంద్రం అవార్డులు, రికార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వాలని మరోసారి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.గతంలోనూ స్వచ్ఛ, పారిశుద్ధ, ఇ…- పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల మూత్ర రహిత రాష్ట్రంగా, ఉత్తమ ఆడిటింగ్ వంట అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, అనేకానేక అవార్డులు, రివార్డులు వచ్చాయని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. అలాగే ఆయా అంశాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు కేంద్రం సూచించిందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు సైతం దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News