Friday, January 10, 2025

మనమే నెం.1

- Advertisement -
- Advertisement -

స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్‌లో తెలంగాణకు అగ్రస్థానం

గ్రామీణ విభాగంలో అవార్డులు.. మిషన్ భగీరథకు జల జీవన్ పురస్కారం

జిల్లాల విభాగంలో జాతీయస్థాయిలో జగిత్యాలకు రెండో ర్యాంకు, నిజామాబాద్‌కు మూడో ర్యాంకు
రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా అందుకున్న పంచాయతీరాజ్ కుమార్ సుల్తానియా

మన తెలంగాణ/హైదరాబాద్: స్వచ్ఛభారత్ గ్రామీణ్‌లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము నుంచి మిషన్ భగీరథకు జలజీవన్ పురస్కారం వరించింది. పథకం నాణ్యత పరిమాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవగా, అన్ని రంగాల్లో కలిపి తెలంగాణ మొ త్తం 13 అవార్డులను కైవసం చేసుకుంది. అందులో భాగం గా 100 శాతం ఇంటింటికీ శుద్ధి చేసిన మంచినీరు అంది స్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎంపికయ్యింది. మిషన్ భగీరధ పథకానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పు రస్కారం లభించింది. అత్యున్నత ప్రతిభ, అద్భుతంగా నిర్వ ర్తిస్తున్న రాష్ట్రంగా కేంద్రం తెలంగాణను అభినందించింది. మిషన్ భగీరథ పథకం నాణ్యతా ప్రమాణం, పరిమాణంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని, అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజు త్రాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ అవార్డులను ఢిల్లీలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు అందుకోగా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు అందుకున్నారు.

53,86,962 గృహాలకు 100 శాతం నల్లా కనెక్షన్‌ల….

జాతీయ జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ మంచినీరు, పారిశుద్ధం, జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదర్శప్రాయమైన పనితీరుకు నిదర్శనంగా రాష్ట్రాన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. తెలంగాణలోని 53,86,962 గృహాలకు గాను 100 శాతం నల్లా కనెక్షన్ల ద్వారా త్రాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది. మిషన్ భగీరథ పథకం పనితీరు, నిర్వహణపై రాష్ట్రంలోని 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా కేంద్రం అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలు సేకరించి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా రోజూ ఇంటింటికీ నాణ్యమైన త్రాగునీరు అందుతున్నట్లు కేంద్రం గుర్తించి తెలంగాణను జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.

దేశవ్యాప్తంగా 2021-22లో

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీలకు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులను ప్రకటించింది. త్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2021-22లో పలు ప్రచార కార్యక్రమాలు, పోటీలు, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ నిర్వహించింది.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్

అన్ని రాష్ట్రాలు, జిల్లాలో స్వచ్ఛతలో ర్యాంకింగ్‌లను ఇవ్వడానికి ఒక స్వతంత్ర సర్వే ఏజెన్సీ ద్వారా 2021-22లో త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం మూడో రౌండ్ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్‌ఎస్‌జి)‘ని నిర్వహించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 725 గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ (SSG) సర్వే జరిగింది. అందులో అగ్ర రాష్ట్రాలు (పెద్ద రాష్ట్రం) విభాగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం 1వ ర్యాంక్ సాధించింది. అగ్ర జిల్లాల విభాగంలో జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు 2వ ర్యాంక్ సాధించగా, ఓవరాల్ టాప్ జిల్లాల విభాగంలో జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా 3వ ర్యాంక్ సాధించింది. టాప్ జిల్లాల విభాగంలో సౌత్ జోన్ స్థాయిలో నిజామాబాద్ జిల్లా 2వ ర్యాంక్ సాధించగా, టాప్ జిల్లాల విభాగంలో సౌత్ జోన్ స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 3వ ర్యాంక్ సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News