Monday, January 20, 2025

నేడు తెలంగాణ గిరిజనోత్సవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గిరిజనోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. శనివారం రవీంద్ర భారతీలో గిరిజనులతో పెద్ద ఎత్తున సమావేశం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్వవతి రాధోడ్ , పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని ఆయా గిరిజన గ్రామాల్లో సభలు జరగనున్నాయి. గత తొమ్మిదేళ్ళలో గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రసావిస్తారు. హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం, కుమ్రంభీం జయంతి, సేవాలాల్ మహారాజ్ జయంతి, సమ్మక్క సారక్క జాతర, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును, వివిధ జాతరలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయం, తదితర వివరాలను ఈ కార్యక్రమంలో వెల్లడిస్తారు.

గిరిజనోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించాలని: మంత్రి సత్యవతి రాథోడ్ 
ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సిఎం కేసీఆర్ గిరిజన జీవితాల్లో గణనీయమైన మార్పు కోరుతూ వారి ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించారు. గిరిజన జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ గిరిజన బాంధవుడుగా గిరిజనుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని గిరిజనులకు ‘ స్వర్ణ యుగం‘ నడుస్తుందని పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 6% నుండి 10% పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాల ద్వారా గణనీయమైన మార్పుకు నాంది పలికారు. ఈ విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా గిరిజనుల సమగ్ర వికాసానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ‘ న భూతో న భవిష్యతి ‘ అన్న రీతిగా ఉందన్నారు. గిరిజనోత్సవాల్లో గిరిజనుల అభివృద్ధి, అందుతున్న సంక్షేమ ఫలాలు రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా గిరిజన ఉత్సవాలను గ్రామీణ ప్రాంతంలో నుండి రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో వైభవంగా నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News