Sunday, November 17, 2024

టెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (టిఎస్‌టెట్) ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి.ఈ మేరకు టెట్ ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.టెట్ పేపర్-1లో 36.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, పేపర్ -2లో 15.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. పేపర్ -2 మ్యాథ్స్, సైన్స్ విభాగంలో టెట్‌కు 1,01,134 మంది హాజరుకాగా, 18,874 మంది(18.66 శాతం), సోషల్ స్టడీస్ సబ్జెక్టు కు 88,913 మంది హాజరుకాగా, 10,199(11.47 శాతం) అర్హత నమోదైంది. అభ్యర్థులు https://tstet. cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

టిఎస్ టెట్ పేపర్ -1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్ -2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. టెట్ పరీక్షను ఈనెల 15న 33 జిల్లాల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్- 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్షను నిర్వహించారు. టీచర్ వృత్తిలో అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టిఆర్‌టి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.

ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితం చెల్లుబాటు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ -1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధించే ఎస్‌జిటి పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News