Saturday, October 5, 2024

టెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం టెట్ ఫలితాల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత నెల 20 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు తొలిసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన టెట్‌కు మొ త్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా, పేపర్ -1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా, పేపర్ 2కు 1,50,491 మంది హాజరయ్యారు. అందులో పేపర్ 1కు 57,725 మంది(67.13 శాతం) ఉత్తీర్ణులు కాగా, పేపర్ 2కు 51,443 మం ది(34.18 శాతం) అర్హత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం పేపర్- 2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. ఫలితాలను https:// schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.

టెట్ ఫీజులపై కీలక నిర్ణయం
టెట్ ఫీజుల విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి టెట్‌లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు తదుపరి టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. టెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒకసారి ఉచితం గా డిఎస్‌సికి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈసారి టెట్‌కు ప్రభుత్వం భారీగా ఫీజులు పెంచింది. గతంలో పేపర్ 1 లేదా పేపర్ 2 ఏదైనా ఒకటి రాస్తే 200 రూపాయల ఫీజు ఉండగా, దాన్ని వెయ్యి రూ పాయలకు పెంచింది. రెండూ పేపర్లు రాస్తే గతంలో 300 రూపాయలు ఉండగా, ఆ ఫీజును ఏకంగా రూ.2 వేల రూపాయలకు పెంచింది. పెంచిన ఫీజులపై అభ్యర్థులు, విద్యావేత్తలు అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేశా దీంతో ఫీజులు తగ్గించేందుకు అనుమతివ్వాలని వి ద్యాశాఖ ఎన్నికల కమిషన్‌ను కోరగా, ఈసీ తిరస్కరించి ందని ప్రభుత్వం వెల్లడించింది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమన నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించింది.

డిఎస్‌సికి టెట్ అర్హత తప్పనిసరి
ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహించే డిఎస్‌సిటి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్‌జిటి పోస్టులకు, పేప ర్ -2కు అర్హత సాధించిన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగ తి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హు లు. ఉపాధ్యాయు పోస్టుల నియామకాలకు నిర్వహించే డిఎస్‌సి హాజరయ్యేందుకు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైనవారితో పాటు బి.ఇడి, డి.ఇడి పూర్తి చేసిన కొత్త అభ్యర్థులు టెట్ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు టెట్‌కు హాజరయ్యారు.

20 వరకు డిఎస్‌సి దరఖాస్తు గడువు
రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్‌సి -2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా…ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనున్నది. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 31 వరకు టిఎస్ డిఎస్‌సి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గురువారం విడుదలైన టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్‌సి రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిఎస్‌సికి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News