Friday, November 15, 2024

తెలంగాణ ఉధ్యమనేత కెసిఆర్ వల్లనే ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేశాం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నాడు ఫ్లోరోసిస్ విసపు నీరు తాగిన ప్రజలు కాళ్లు చేతు వంకర్లు, ఇతర అనారోగ్యాల పాలు అయ్యారని ,బిందెడు నీటికోసం కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేదని అన్నారు. తెలంగాణ ఉధ్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉధ్యమ సమయంలో నియోజకవర్గంలో ప్రజల నీటి కష్టాల గోస చూసి ,ఫ్లోరోసిస్ నుండి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమంతో ఇంటింటికి కుళాయిల ద్వారా కృష్ణా నదీ జలాలను శుధ్ది చేసి స్వఛ్చమైన మంచినీటిని సరఫరా చేస్తుందని అన్నారు.

ఆదివారం నాంపల్లి మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామంలో గల నీటిశుధ్ది కేంద్రంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల సందర్బంగా మంచినీటి పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిపి ఏడుదొడ్ల శ్వేతరవీందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అంగిరేకుల పాండు , ఎంపిటిసి బెక్కం రమేష్‌లు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పా టు ప్రజా ప్రతినిధులతో కలిసి పంప్ హౌజ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతు న్న సంక్షేమ అభివృధ్ది కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడంలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులకోసం ఉచిత నాణ్యమైన విద్యుత్, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు,పంటలకు గిట్టుబాటు ధర, రైతు భీమా తదితర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు. అదేవిదంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ కల్లుగీత ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మునుగోడు నియోజకవర్గంలో త్రాగునీటి జలాల కోసం ప్రజలు పడ్డ గోసను వివరించారు.

చండూరు జెడ్పీటిసి కర్నాటి వెంకటేశం, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, చండూరు ఎంపిపి పల్లె కళ్యాణిరవికుమార్‌గౌడ్, మర్రిగూడ ఎంపిపి మెండు మోహన్‌రెడ్డి, మాల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్వర్,నారాయణ పురం ఎంపిపి గుత్తా ఉమా, జెడ్పీటిసి గౌడ్,నాంపల్లి తహసీల్దార్ ఆంజనేయులు,ఎంపిడిఓ సురేష్‌కుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ ఇక్బాల్ , నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు మునగాల సుదాకర్‌రెడ్డి, పంచాయితి కార్యదర్శి జావేద్, మిసన్ భగీరధ డిఈ రవి, శ్రీనివాస్, ఏఈ రామచంద్రయ్య, అభిషేక్, ఏఎన్‌ఎం ఏరెడ్ల లక్ష్మి మోహన్‌రెడ్డి, సర్పంచులు ,ఎంంపిటసిలు, సింగిల్ విండో చైర్మన్‌లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News