Thursday, November 14, 2024

ఆకలితో రోడ్డు ఎక్కిన తెలంగాణ వర్సిటీ విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్ లో భోజనాలు పెట్టకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై ఖాళీ ప్లేట్లతో వర్సిటీ విద్యార్థులు కూర్చున్నారు. జీతాలు రాలేదని హాస్టల్ సిబ్బంది వంటలు చేయలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆకలితో రోడ్డు ఎక్కారు. వర్సిటీ పక్కన ఉన్న నడిపల్లి తండాల్లో విద్యార్థులు భిక్షాటన చేశారు.

గ్రామంలో ఆహారం అడుక్కున్న విద్యార్థులు మెయిన్ గేటు వద్ద తింటున్నారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రాంగణం బుధవారం రోజంతా సిబ్బంది, విద్యార్థి సంఘాల నిరసనలతో నిండిపోయింది. హాస్టళ్లలో సిబ్బంది పనిచేయడం లేదని విద్యార్థులు ఏకకాలంలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. రిజిస్ట్రార్ నియామకం వివాదం నేపథ్యంలో జీతాల బిల్లులు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అనుమతించకపోవడంతో సిబ్బంది గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News