- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. తెలంగాణ వర్సిటీ వీసీ దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోదక శాఖ(ఎసిబి) అధికారులకు చిక్కాడు. రూ . 50 వేలు లంచం తీసుకుంటూ వైస్ ఛాన్సలర్ ఎసిబికి చిక్కాడు. తార్నాకలోని ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. భీమ్ గల్ లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ వర్సిటీ వీసీ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ప్రస్తుతం తార్నాకలోని విసి చాచేపల్లి రవీందర్ ఇంట్లో ఎసిబి తనిఖీలు కొనసాగుతున్నాయి.
- Advertisement -