Monday, December 23, 2024

తెలంగాణ వైస్-ఛాన్స్‌లర్ డా. నీరజకు మరో అరుదైన గుర్తింపు

- Advertisement -
- Advertisement -
ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ అడ్వైజరీ కమిటి చైర్మన్‌గా ఎంపిక

మన తెలంగాణ / హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ ఆంధ్ర ప్రదేశ్ లోని పెదవేగి లో గల భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఉద్యాన విజ్ఞాన డివిజన్ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో భారత దేశంలో ఆయిల్ పామ్ పంట పరిశోధనకు సంబంధించి కావలసిన సలహాలు, సూచనలు డాక్టర్ నీరజ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.

దేశంలో నూనె గింజల కొరత తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం తనదైన శైలిలో ఆయిల్ పామ్ సాగుకు భారీ ప్రణాళికలు రచించింది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. భారీ ఎత్తున సాగుకు సమాయత్త మౌతున్న నేపథ్యంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు లాభ సాటిగా ఉండేందుకు, నాణ్యమైన అధిక ఆయిల్ పామ్ గెలలు సాధించేందుకు అవసరమైన పరిశోధన, సాంకేతిక అంశాల పై చర్చించే కమిటీకి డాక్టర్ నీరజ ప్రభాకర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వచ్చే మూడు సంవత్సరాలు ఆమె చైర్మన్ గా కొనసాగనున్నారు.
లాభసాటి పంటగా ఆయిల్ పామ్ సాగు : డా. నీరజ ప్రభాకర్
ప్రస్తుతం ప్రాజెక్టుల వల్ల పెరిగిన సాగునీటి అందుబాటుతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గుచుపాల్సిన అవసరం ఉన్నదని డా. నీరజా ప్రభాకర్ అనారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ పంట చిరునామాగా ’తెలంగాణ ’ ఎదగనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News