Saturday, November 23, 2024

విలీన దినోత్సవంపై రాద్ధాంతం చెయ్యొద్దు: బోడకుంటి

- Advertisement -
- Advertisement -

Telangana vileena dinotsavam comments by Bodakunti

హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు అని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్ మోడల్ గా మారిందని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు రెండూ వేరు వేరు కాదని పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అని, అదే గులాబీ సైన్యమని గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోనే అధికారంలోకి వచ్చాకా అమలు చేస్తున్నామని, తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్నది కుడా అదేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ టిఆర్ఎస్ పార్టీ రూపొందించినవేనని ఆయన తెలియజేశారు.

అటువంటి గులాబీ జెండాయె ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. యావత్ భారత దేశంలోనే తెలంగాణాను ముందు వరుసలో ఉంచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును విమర్శించే నైతికత ఏ ఒక్కరికి లేదని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి పార్టీల జెండాలు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయన్నారు. అటువంటి పార్టీలకు తెలంగాణాలో కాలం చెల్లిందని ప్రతి చోట ఎగరాల్సింది ఒక్క గులాబీ జెండాయో అన్నది టిఆర్ఎస్ పార్టీ లీడర్, క్యాడర్ గుర్తించాలని బోడకుంటి స్పష్టం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆసరా ఫించన్, రైతుబీమా, రైతుబందు, కెసిఆర్ కిట్, మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి మంచినీటి పధకాలు అమలు జరుగుతున్నాయా? అన్ని ప్రశ్నించారు.  గులాబీ సైన్యం తెలుసుకొని ప్రజలకు తెలియ జెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

అటువంటి పార్టీలు 2014 కు ముందు పాలించినప్పుడు ఎందుకు 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ అందించలేకపోయిందో వివరించాలన్నారు. తెలంగాణ సమాజం గుర్తించిందని అదే విషయాన్ని మరింత లోతుగా తీసుకెళ్లి ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రయేతరలు పేరుతో జాతర చేస్తున్న పార్టీలు తగిన బుద్ధి చెప్పాలని బోడకుంటి పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు ఉచిత విద్యుత్ అమలు జరగడం లేదన్నది ప్రజలకు వివరించాలన్నారు. పథకాల అమలులో గులాబీ సైన్యం ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్దిపొంది మరో పార్టీ జెండాలు మోస్తున్న వారిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని ఆయన కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News