Monday, December 23, 2024

ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు జరపాలి: భట్టి

- Advertisement -
- Advertisement -

Bhatti Vikramarka slams Centre Govt

హైదరాబాద్: తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా చేపట్టాలని మాజీ మంత్రి, ఎంఎల్ఎ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ రాచరిక పాలన నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పారు.  1947, ఆగస్టు 15న బ్రిటిష్ రాచరిక పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం వస్తే… 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం రాచరిక పాలన నుంచి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు.  దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు, హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ లు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేశారని భట్టి ప్రశంసించారు.

దేశంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఏడాదిపాటు జరిగినట్టే.. తెలంగాణలో కూడా ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ విలీన వజ్రోత్సవాల సందర్భంగా నెహ్రు, పటేల్ లతోపాటు తెలంగాణ విముక్తి కోసం స్వామి రామనంద తీర్థ, సర్దార్ జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నర్సింహారావు, చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలమ్మ, తదితరలు పోరాటం చేశారన్నారు.

నిజాం వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గౌరవించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాది పాటు వారి పోరాటాలు, త్యాగాలపై నేటి యువతరానికి గుర్తు చేసి విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ త్యాగధనుల వారసులను గుర్తించి వారిని తగిన విధంగా సన్మానాలు చేయాలని భట్టి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News