మన తెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో శుక్రవారం తెల్లవారుజామున రూ. 42 కోట్ల నగదు ను ఐటి అధికారులు సీజ్ చేశారు. తెలంగాణకు ఈ నగదును తరలిస్తున్న సమయంలో ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్ నుండి నగదును తరలిస్తున్నారని సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రూ.8 కోట్లను తెలంగాణకు తరలించినట్టుగా ఐటి అధికారులు అనుమానిస్తున్నారు.బెంగళూరు నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్ తరలించి ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ నగ దు కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన డబ్బుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరో వైపు ఈ కేసు ఐటి నుంచి ఇడికి బదిలీ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కర్ణాటక నుం చితెలంగాణకు నగదును తరలిస్తున్నారనే సమాచారంతో సో దాలు చేపట్టారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైన సంగతి విదితమే. అక్రమంగా సొమ్ము దాచి ఎన్నికల కోసం పంపుతున్నారనే విశ్వస నీయమైన సమాచారం అందడంతో వెంటనే ఐటి శా ఖ అప్రమత్తమైంది. దాంతో బెంగళూరులోని ఆర్టి నగర్ సమీపంలోని ఆత్మానంద కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లోని భాగంగానే ఐటి అధికారులు బెడ్ కింద నుండి ఒక్కొక్క బాక్స్ తీస్తున్న కొద్ది బయటకి వస్తూనే ఉన్నాయి. దాదాపు 22 పెట్టెలు బయటికి తీసి, వాటిని తెరిచి చూసి షాక్ అ య్యారు. బెడ్ కింద దాచిన బాక్సుల్లో మొత్తం రూ.42 కోట్లు లభ్యమయ్యాయి. రూ.42 కోట్ల విలువైన 500 నోట్ల కట్టలను 22 పెట్టెలో దాచిపెట్టి వాటిని బెడ్ కింద పెట్టారని ఐటి అధికారులు పేర్కొన్నారు.
ఐటి అధికారులకు పక్కా సమాచారం రావడంతో ఆ ర్ టి నగర్ లోని రెండు చోట్ల దాడులు నిర్వహించారు. ఒకచోట నగదు లభ్యం కాలేదు. మరోచోట పెద్ద మొత్తంలో డబ్బులు లభ్యమయ్యాయి. ఫ్లాట్ ఖాళీగా ఉందని అక్కడ ఎవరు నివసించడంలేదని తెలిసింది. దీంతో అధికారులు ఫ్లాట్ యజమాని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఐటి అధికారులు ఈ కేసుకు సంబంధించి మాజీ కార్పొరేటర్ తో పాటు ఆమె భర్తను వారి నివాసంలోనే విచారిస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ఒక కాంట్రాక్టర్. అతను కాంట్రాక్టర్ల సంఘంలో భాగంగా గత బిజెపి ప్రభుత్వం ప్రాజెక్టులో 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించారు. ఐటి అధికారులు 42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకొని మాజీ కార్పొరేటర్ తో పాటు ఆమె భర్తను విచారిస్తున్నారు. కాగా బెంగళూరు నుంచి బైరే సంద్రకు లారీలో నగదును తరలించి, అక్కడి నుంచి ఏడు కార్లలో తెలంగాణకు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అంతేగాక బెంగళూరులో మరో 5 చోట్ల ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాంట్రాక్టర్ అంబికాపతి ఇల్లు, గెస్ట్‌హౌస్, ఆఫీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని ఓ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. మరో వైపు రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బిఆర్‌ఎస్ కూడ అంతే పట్టుదలతో కార్యరంగంలో దిగింది.
నాలుగు రోజుల వ్యవధిలో రూ.37 కోట్లు పట్టివేత…
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హైద్రాబాద్ సహా రా ష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని నగదును పోలీసులు సీజ్ చేశారు. బంగారం, వెండిని కూడ పోలీసులు సీజ్ చేశారు. గత నాలుగు రోజులుగా పోలీసుల తనిఖీల్లో రూ. 37 కోట్లు ప ట్టుబడ్డాయి. 30 కిలోల బంగారం, 350 కిలోల వెండిని కూడ పోలీసులు సీజ్ చేశారు.తెలంగాణలో ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కొందరు అధికారులను విధుల నుండి తప్పించింది ఇసి, ఈ అధికారుల స్థానంలో కొం దరిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మరో వైపు మద్యం, నగ దు తరలింపును అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈసీ అధికారులకు సూచించింది.