Wednesday, January 22, 2025

తెలంగాణలో 1019 గురుకులాలు.. ఎపిలో 308 గురుకులాలు… సిగ్గుతో తలదించుకోవాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యారంగంలో ఎపికి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఎపి మంత్రి బొత్స సత్యనారాయణకు తెలంగాణ విద్య వ్యవస్థపై విమర్శలు చేయడంతో మంత్రి గంగుల కమలాకర్ రీ కౌంటర్ ఇచ్చారు. విద్యావ్యవస్థలో తెలంగాణ కేరళను మించి పోయిందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైఎస్సార్ సిపి మంత్రులు అని, కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో విద్యా విధానం బాగుందని మెచ్చుకున్న విషయాలను గుర్తు చేశారు.

Also Read: ప్రేమజంటను చంపేసి… చెట్టుకు వేలాడదీశారు… ముగ్గురు అరెస్టు

ఉమ్మడి రాష్ట్రంలో సరిపడా గురుకులాలు లేవని, 298 గురుకులాలు మాత్రమే ఉండేవని, ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగా లేదన్నారు.  ఇప్పుడు తెలంగాణ లో 1019 గురుకులాల్లో 6,75,000 మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చదువుతున్నారని, ఒక్కోక్క విద్యార్థిపై‌ లక్ష రూపాయల తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ఎపిలో ఇప్పటికీ 308 గురుకులాలు మాత్రమే ఉన్నాయని, 25000 మంది విద్యార్థులు ‌మాత్రమే గురుకులాలో చదువుతున్నారని గంగుల దుయ్యబట్టారు.  బొత్స సత్యనారాయణ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకతవకలు జరిగితే దొంగలని దొరకపట్టి అరెస్టు చేయించారని, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర ఆంధ్రవాళ్లది కాదా? అని గంగుల ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక ఆంధ్ర వారి కన్ను తెలంగాణ మీదనే ఉందని, తెలంగాణతో ఎపి నాయకులకు ఏం పని అని అడిగారు. తెలంగాణలో పైరవీలకు తావు లేదని, ఆంధ్ర నాయకులు ఎపి విద్యా విధానం చూసి సిగ్గుతో తలవంచుకోవాలని గంగుల చురకలంటించారు. దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News