Friday, November 22, 2024

ఎసిబికి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి, జిఎం

- Advertisement -
- Advertisement -

Telangana Warehousing Corporation GM in ACB net

హైదరాబాద్‌: అవినీతికి పాల్పడిన తెలంగాణ గిడ్డంగుల సంస్థ జిఎం సుధాకర్‌రెడ్డి ఎసిబి వలలో చిక్కాడు. సుధాకర్‌రెడ్డి పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రైడ్‌ చేసి పట్టుకున్నారు. అయితే, మార్క్‌ఫెడ్‌ ఎండి భాస్కరాచారి ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్టు సుధాకర్‌రెడ్డి అధికారులకు తెలిపాడు. సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి ఇరువురిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Telangana Warehousing Corporation GM in ACB net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News