Wednesday, January 22, 2025

అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేనేలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని మంత్రి కెటిఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. గతంలో పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని జిహెచ్‌ఎంసి అధికారులు తొలగించారు. శుక్రవారం పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. దళితబంధు సాహసోపేతమైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కెసిఆర్‌కే సాధ్యమైందన్నారు. సిఎం కెసిఆర్ దమ్మున్న నేత అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలకు అవసరమైన నిర్ణయాలను కెసిఆర్ తీసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాగుట్ట చౌరస్తాకు అంబేద్కర్ పేరు పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News