Monday, December 23, 2024

రేవంతూ… రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందా?….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అమెరికాలో ఉచితాల గురించి టిపిసిసి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని దీన్ని తాము ఖండిస్తున్నామని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ తెలిపారు.రేవంత్ వ్యాఖ్యలపై ప్రకాష్ రీకౌంటర్ ఇచ్చారు.  గతంలో ధరణి ఎత్తేస్తామని చెప్పాడంతో తెలంగాణ రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అజ్ఞానంతో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అనడం సరికాదని ప్రకాష్ మండిపడ్డారు.

Also Read: గుజరాత్‌కు గుడ్‌బై

కానీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాంగా తెలంగాణ రైతులు ఎదిగారని ప్రశంసించారు. 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ నిలిచిందని కొనియాడారు. మరి అలాంటప్పుడు ఉచిత విద్యుత్ అవసరం లేదని అపరిపక్వ మాటలు మాట్లాడడం తప్పు అని చురకలంటించారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధును కూడా రేవంత్ వద్దంటారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News