- Advertisement -
మన తెలంగాణ/వాజేడు : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతలు పర్యాటకులను కట్టిపడేస్త్తున్నాయి. మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నయగార జలపాతం అని పేరుగాంచిన బొగత జలపాతం, అరుణాచలపురం గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఉన్న గుండం జలపాతం, దూలపురం గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఉన్న మాంసం లొద్ది జలపాతం, ముమూరు అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగులసరి జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు తరలివచ్చి జలపాతం అందాలను, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వర్షాకాలంలో ఈ జలపాతలు గుట్టలపై నుంచి పాలనురగల్లా జాలువారుతూ చూపరులను కట్టిపడేస్తున్నాయి.
- Advertisement -