Monday, December 23, 2024

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దత్తకకడే
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని మహారాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దత్తకకడే అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దత్తకకడే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అద్యాయనం చేయడానికి సర్పంచ్‌ల బృందం జమ్మికుంట చేరుకుంది. జమ్మికుంట పట్టణంలో దళితబంధు పథకం ద్వారా మంజూరు అయిన ఏటూ జెడ్ మెడికల్ షాపును సందర్శించి పథకం ద్వారా పొందే ఆదాయం, తదితర అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దత్తకకడే మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా, వితంతు, వికలాంగులకు పెన్షన్ సౌకర్యం, కళ్యాణలక్ష్మి, శాధీముభారక్, కేసీఆర్ కిట్, ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిర్విరామంగా అమలు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ముఖ్యంగా దళిత కుటుంబాలు అనాదిగా ఆర్థిక, అసమానతలకు గురి అవుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న విషయాన్ని గ్రహించి దేశంలో ఎక్కడలేని విధంగా దళితబంధు అనే పథకానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.

దళితబంధు పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుకు ఎలాంటి శరతులు లేకుండా ఆర్థికంగా బలోపేతం కావడానికి 10లక్షల రూపాయలను నేరుగా అందించడం అభినందనీయం అనిఅన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అంతకుముందు మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో సర్పంచ్‌ల బృందానికి ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రభుత్వం విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి, జగ్గయ్యపల్లి గ్రామసర్పంచ్ కనపర్తి వంశీధర్‌రావు, కౌన్సిలర్లు పాతకాల రమేష్, దయ్యాల శ్రీనివాస్, రాము, రాజు, బిక్షపతి, నరేష్‌లతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News