Monday, December 23, 2024

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: తెలంగాణలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాలయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టనంలోని శారద గార్డెన్ 2 లో సంక్షేమ కార్యక్రమాలపై పరిగి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నారని అన్నారు.

ఆసరా పించన్లు, వృదాప్య, వికలాంగులు, ఒంటరి మహిళా పించన్లు, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, మైనార్టీలకు షాదీముబారక్, వ్యవసాయ పెట్టుబడులకు రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఆసుపత్రిలో కాన్ఫు చేయించుకున్న మహిళలకు కేసిఆర్ కిట్టు, దళితుల అభివృద్ధ్దికి దళితబంధు, కులవృత్తులకు చేయూతను అందిస్తున్నారని తెలిపారు. గురుకుల విద్య , వ్యవసాయరంగ ఇలా అనేక సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తున్నారని చెప్పారు. వివిధ కులాలకు లక్ష వరకు ఆర్థిక సహాయం అందించి చేయూత అందించేందుకు ఈ నెల 20వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ కులాలకు మంజూరైన లక్ష ఆర్థిక సమాయాన్ని లబ్ద్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి దీపారెడ్డి, ము న్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, జడ్‌పిటిసి హారిప్రియారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సురేందర్, వైస్ ఎంపిపి సత్యనారాయణ, సొసై టీ వైస్ చైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పూడూరు, దోమ, కులకచర్ల, గండ్వీడ్ మండలాల ఎంపిపిలు మల్లేశం, అనుసూజ, సత్యహారిశ్చంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, జడ్‌పిటిసిలు మేఘమాల, నాగిరెడ్డి, రాందాస్‌నాయక్, నవ్యారెడ్డి, ఎంపిడిఓలు శేషగిరిశర్మ, జయరాం, ఉమాదేవి, కౌన్సిలర్ వేముల కిరణ్, వారాల రవీందర్, ఎదిరే కృష్ణ, వెంకటేష్, నాగేశ్వర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ద్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News