Thursday, January 23, 2025

దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -
  • వికలాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వు పత్రాలు అందచేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

పర్వతగిరి: ఆసరా అవసరమైన దివ్యాంగులకు అందిస్తున్న మొత్తాన్ని పెంచి సీఎం కేసీఆర్ వారికి మరింత ఆర్థిక భరోసా కల్పించారని బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. వర్ధన్నపేటలోని ఎంఎంఆర్ గార్డెన్స్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల వికలాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అత్యధిక పింఛన్తు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికి నెలకు అందించే పింఛన్‌ను రూ. 3116 నుంచి 4116కు పెంచినట్లు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో 5265 మంది వికలాంగులకు నెలకు రూ. 2.11 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

దివ్యాంగులకు పింఛన్ పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5.11 లక్ష మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పింఛన్ పెంపు వల్ల నెలకు రూ. 205.48 కోట్లు ఆసరా కింద రాష్ట్రంలోని దివ్యాంగులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు తండాలు, కాలనీలకు చెందిన 21 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ లబ్ధిదారులకు బుధవారం రూ. 21.02 లక్షలు, ఐదుగురు సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు రూ. 2.93 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News