Monday, December 23, 2024

అధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలంగాణ

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం టౌన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక శోభను సంతరించుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ విరాజిల్లుతుందని మాజీమంత్రి కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం స్థానిక గణేష్ టెంపుల్‌లో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వనమా మాట్లాడుతూ అన్ని మతాలు, కులాలు, వర్గాలకు ముఖ్యమంత్రి సమన్యాయం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్నారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జెడ్‌పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ తాటి పల్లి శంకర్‌బాబు, ఈవో సులోచన, కౌన్సిలర్ జయంతి మసూర్, పల్లపు లక్ష్మణ్, కో ఆప్షన్ మెంబర్ దూడల బుచ్చయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News