రామగుండం: కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని, 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి రామగుండం పట్టణంలోని ఓప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే చందర్‌కు పట్టణ ప్రజలు జీరో పాయింట్ నుంచి సభాస్థలి వరకు కోలాటాలు, మంగళహారతులు, ర్యాలీతో ఘనం గా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను సి ఎం కెసిఆర్ తెలంగాణలో అమలు పరుస్తూ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. ఆయన పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని అన్నారు. సమైక్య పాలనలో కాంగ్రెస్ 70 ఏళ్లు పాలించిందని, ఆ సమయంలో తెలంగాణను అభివృద్ధికి, సంక్షే మానికి ఆమడదూరంలో పెట్టిందని అన్నారు. గతంలో పెన్షన్ రూ.200లు కంటి తుపుడు చర్యగా అందించారని అన్నారు.
గత ప్రభుత్వంలో నిరుపేద వర్గాల ప్రజలు ఎలాంటి సంక్షేమం లేకుండా, అభివృద్ధి లేకుండా జీవనం సాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎ పవర్ హౌస్ కూలదోసి, బిపిఎల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ట నిర్మాణం కాకుండా ప్రజలను రోడ్డున పడేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించారు. శాప్ చైర్మన్‌గా గతంలో కొనసాగిన మక్కాన్‌సింగ్ రామగుండం నియోజక వర్గ ప్రజలకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.
అభివృద్ధికి నోచుకోలేక తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్న క్రమంలో సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్‌ను స్థాపించి, అన్ని వర్గాల పోరాటాలతో, ఉద్యమంలో తెలంగాణను సాధించుకోవడం జరిగిందని, అదే స్ఫూర్తితో తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు.
బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, అమ్రిన్ ఫాతిమా సలీం బేగ్, దొంత శ్రీనవాస్, కొమ్ము వేణుగోపాల్, దాతు శ్రీనివాస్, బాలరాజ్‌కుమార్, జనగామ కవితా సరోజిని, కల్వచర్లకృష్ణవేణి నాయకులున్నారు.