Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ హయాంలో తెలంగాణ పురోగమిస్తుంది

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డిలో 2కే రన్‌తో సందడి
  • జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్

సంగారెడ్డి: 9 పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్నీ సిఎం కెసిఆర్ ముందు చూపుతో అన్నిరంగాల్లో అభివృద్ది చేసి దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టారని జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2కే రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మెన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రాష్ట్రాన్నీ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఎక్కడ లేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బిసి కులాలకు లక్ష రుపాయల ఆర్థిక సాయాన్నీ చేసేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు.

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. 2కే రన్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధ్ది పథంలో ముందుకెళుతుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. సిఎం కెసిఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారన్నారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. సిఎం కెసిఆర్ పోలీసు వ్యవస్థను ప్రెండ్లీ పోలీసుగా మార్చరని చెప్పారు. తాను 2014లో జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు రోడ్లు ఆధ్వానంగా ఉన్న ప్రయాణం బాధాకరంగా ఉండేదన్నారు. తాగునీటికి సాగునీటికి ప్రజలు కనబడేవారని తెలంగాణలో ఏర్పడిన తర్వాత కొత్త రోడ్ల నిర్మాణం రోడ్ల పునరుద్ధ్దరణలతో రోడ్లు బాగయ్యాయని మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు.

మిషన్ కాకతీయ, చెక్ డ్యామల నిర్మాణంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయని సాగు విస్తీర్ణం మూడింతలు పెరిగిందన్నారు. పంట దిగుబడి అదేవిధంగా పెరిగిందన్నారు. సిఎం కప్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలలో చైతన్యం వచ్చిందని అన్ని కార్యక్రమంలో భాగస్వాములు అవుతారన్నారు. జిల్లా ఎస్‌పి రమణకుమార్ మాట్లాడుతే ఒకప్పుడు ఏదైనా సమస్య ఉంటే సినిమాలో లాగా అంత అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చే వారని, తెలంగాణ పోలీసులు అలాకాదని ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయల, డిఆర్‌ఓ నగేష్, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డి, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, సిడిసి చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, టిజిఓ అధ్యక్షుడు వైద్యానాథ్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News