హైదరాబాద్: ఓ మహిళ తనను కాటేసిన పామును చంపి, దానిని సోమవారం ములుగు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు అదే రకం పామో గుర్తించేందుకు ఆమె అలా చేసింది. వెంకటాపురం నుగురు మండల్ లోని ముకునురుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మను పాము కాటేసింది. దాంతో వెంటనే ఆమె స్పందించి పామును చంపేసింది. దానిని పారేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని వేసి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి డాక్టర్లు అది విషపూరిత పామేనని గుర్తించి ఆమెకు సరైన చికిత్స అందించారు.
A woman was bitten by a #snake in Venkatapuram of #Mulugu dist, the woman killed the snake & brought it to the hospital by putting it in a bottle.
Shantamma said that she will be able to show the doctor which particular snake bit her for proper treatment.#Telangana #SnakeBite pic.twitter.com/WpiyROf7II
— Surya Reddy (@jsuryareddy) April 16, 2024