Monday, January 20, 2025

మహిళా నాయకత్వం అంటే మోడీకి గిట్టదు: కవితకు మంత్రుల మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పలువురు మంత్రులు ఆమెకు మద్ధతు తెలిపారు.
కేంద్రంలోని ప్రధాని మోడీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారు విరుచుకుపడ్డారు. సిఎం కెసిఆర్ లాంటి నాయకుడిని ఎదుర్కొనలేక ఈడీ, సిబిఐ, ఐటీలను ముందుపెట్టి భయపెట్టాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు కవితకు మద్ధతుగా శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బిజెపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా నాయకత్వం అంటే మోడీకి గిట్టదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుందని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ఆరోపించారు. ఈడీ, సీబిఐ కేసులకు భయపడమని వారు స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న భయంతోనే దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోడీ ఉసిగొల్పుతున్నారని వారు విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News