Monday, December 23, 2024

మహిళా సంక్షేమానికి పెద్ద పీట: తాటికొండ రాజయ్య

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రం జంట పట్టణం శివునిపల్లిలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి దేశంలోనే విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో మాత, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గటంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరగడం జరిగిందన్నారు. మహిళా శ్రేయో రాజ్యస్థాపన దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు, ప్రోత్సాహకాలను అమలుచేస్తుందన్నారు.

నియోజకవర్గంలో 409 మెయిన్ అంగన్‌వాడీ సెంటర్లు, 16 మినీ అంగన్‌వాడీ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీ, బాలింతలకు నెలలో 25 రోజుల పాటు ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుందన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే వి హబ్ అని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి మెమెంటో అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దారు పూల్‌సింగ్ చౌహాన్, ఏసీపీ రఘుచందర్, సీఐ రాఘవేందర్, ఎస్సై శ్రవణ్‌కుమార్, ఐసీడీఎస్ సీడీపీఓ ఫ్లోరెన్స్, సింగపురం అనిత, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News