Sunday, December 22, 2024

ఆ రెండు ప్రాజెక్టుల విషయంలో ఎపితో కలిసి పని చేస్తాం: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాజెక్టుల సెఫ్టీని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నాగార్జున సాగర్, జూరాల, సింగూరు, కడెం ప్రాజెక్టుల రిపేర్లు పూర్తి చేశామని వివరించారు. ప్రాజెక్టుల మెయిన్‌టెనెన్స్ కోసం ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదలు చేసిందని వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాల కురవడంతో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకొని పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోని ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో ఎపి ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల్లో బురద, ఇసుక తొలిగింపు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అన్ని డ్యామ్‌లను మేడిగడ్డతో పోల్చొద్దని, మేడిగడ్డ డిజైన్ బాగోలేదని, నాసిరకంగా నిర్మించారని, మెయిన్‌టెనెన్స్ బాగోలేకపోవడంతో కుంగిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు . తెలంగాణలో ప్రాజెక్టుల సెఫ్టీని మానిటరింగ్ చేసేందేకు డ్యామ్ సెఫ్టీ అధికారి ఇంజనీరింగ్ చీఫ్‌గా నాగేందర్ రావు ఉన్నారని తెలియజేశారు. ప్రాజెక్టులో సమస్యలు వస్తే ఆయన కింది స్థాయి అధికారులకు సలహాలు, సూచనలు చేస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News