మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధప్రదేశ్ ప్రభుత్వం గాలేరునగరి సు జల స్రంవంతి ప్రాజెక్టులో అంతర్భాగంగా చిత్తూరు జిల్లా లో చేపట్టిన ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఎటువంటి అనుముతులు లేకుండానే ఈ రిజర్వయర్ నిర్మిస్తున్న ట్టు ఫిర్యాదు చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ ము రళీధర్ గురువారం బోర్డుకు ఈ మేరకు లేఖ రాశారు.
ఎన్జీటి స్టే ఇచ్చి , జరిమానా విధించినప్పటికీ పనులు కొనసాగిస్తున్నట్టు లేఖ లో తెలిపారు. తక్షణమే పనులు నిలిపివేయించాలని కోరారు. ఉ మ్మడి జలాశయాల నీటి వాటాకు సంబంధించి కూడా రెండు నె లల కిందట ఈఎన్సీ బోర్డుకు లేఖ రాశారు. ఈ జలాశయాలనుం చి ఏపి ఇప్పటికే తన వాటాకు మించి నీటిని వాడుకుంటుందని, ఇకనుంచి అధికంగా నీటిని వాడకుండా చూడాలని కోరారు. ఈ సంవత్సరలో ఫిబ్రవరి చివరివరకూ ఏపి 673 టిఎంసీల నీటిని ఉపయోగించుకుంటే,తెలంగాణ మా త్రం కేవలం 211టిఎంసీల నే వాడుకుందని లేఖలో తెలిపారు. మొత్తం 971టిఎంసీలలో ఏపి తన వాటకంటే అధికంగా మొత్తం 74శాతంపైగా నీటిని వినియోగించుకుందని తెలిపారు.
ఏపి ప్రభుత్వం తన వాటాకు మిం చి అధికంగా వినియోగించుకుందని తెలిపారు. తెలంగాణకు ఈ ఏ డాది ఇంకా 108టిఎంసీలు దక్కాల్సి వుందని తెలిపారు. ఉమ్మ డి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఇక 76 టిఎంసీల నీటినిలువలు ఉన్నట్టు తెలిపారు. ఏపి ఇదేవిధంగా నీటి ని వా డితే తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉన్నందని, దీంతో ఎపిని కట్టడి చేయాలని ఈఎన్సీ మురళీధర్ బోర్డును కోరారు.