Monday, December 23, 2024

మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ కృషి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కేంద్రం స్కిల్ డేవల ప్మెంట్ సెంటర్‌లో జరిగిన 47 మైనార్టీలకు ఆర్ధిక సహాయ పథకం ద్వారా లబ్ధ్దిదారులకు రూ. 1 ఆర్థ్ధిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే ఎస్. రాజేంద ర్‌రెడ్డి పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల్లోని పేదలకు ని రుద్యోగులు సొంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రూ. లక్ష ఉచిత గ్రాంటును అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

లక్ష మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లిం మైనార్టీ ల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సిఎం కెసిఆర్ ప్రత్యేక వారికి మైనార్టీ బంధు పథకం ద్వారా రూ. లక్ష సబ్సిడీతో వారికి అందించి అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన అంటేనే ప్రజలకు భరోసా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News