Thursday, December 26, 2024

తెలంగాణ పారిశ్రామిక రంగం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : దేశానికే తెలంగాణ పారిశ్రామిక రంగం ఆదర్శంగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చర్లపల్లి పారిశ్రామికవాడలోని సిఐఎ ఆడిటోరియంలో పారిశ్రామిక ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి పారిశ్రామికవేత్తలు, కార్పొరేటర్లతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పారిశ్రామికరంగంలో సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

పారిశ్రామిక రంగం సాధించిన పలు అంశాలను అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఅర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం పవర్‌హలీడేలతో ఇబ్బంది పడ్డ పారిశ్రామికవేత్తలకు నేడు నాణ్యమైన విద్యుత్ అందిస్తు పారిశ్రామికప్రగతికి ప్రభుత్వం చేయుతనందిస్తుదని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 120 కొత్త పారిశ్రామికవాడలను తీసుకువచ్చి లక్షాలాది మంది ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ముఖ్యంగా టిఎస్‌ఐపాస్ తీసుకువచ్చి నూతన పరిశ్రమలకు 15 రోజులలో అన్ని అనుమతులు ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రత్యేకంగా మేడ్చల్ జిల్లా పరిధిలోనే ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కుషాయిగూడ వంటి నాలుగు పారిశ్రామికవాడలు ఉన్నయని తెలిపారు.

కార్యక్రమంలో కొండవీటి సుధీర్‌రెడ్డి, చర్లపల్లి, కుషాయిగూడ ఐలా కమిషనర్లు ఉమామహేశ్వర్, సుధాకర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ కమిషనర్లు శంకర్, అరుణకుమారి, చర్లపల్లి ఐలా చైర్మన్ జెక్క రోషిరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, సిఐఎ అధ్యక్షుడు గోవింద్‌రెడ్డి, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ, మల్లాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు సింగిరెడ్డి శీరిషసోమశేఖర్‌రెడ్డి, బొంతు శ్రీదేవియాదవ్, జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్‌రెడ్డి, వివిధ ఐలాల ప్రతినిదులు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News