Saturday, November 23, 2024

తెలంగాణ తలసరి ఆదాయం రెండింతలు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Telanganas per capita income doubles

హైదరాబాద్: 20 ఏళ్ళ ఉజ్వల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి చారిత్రాత్మకమైన విజయాలను సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పరిపాలన సందర్భంలో నూతన ఆవిష్కరణలెన్నో చేసిందని, భారత దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ ప్రస్థానం ఒక అపూర్వ అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసించారు.  20 టిఆర్ఎస్ ప్రస్థానం ప్లీనరీలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

14 సంవత్సరాలు వీరోచిత పోరాటం

సమైక్య రాష్ట్రంలో దారుణమైన వివక్ష, విద్రోహాలతో అణగారిపోయిన తెలంగాణ జాతిని మేల్కొలుపుతూ 2001 ఏప్రిల్ 27 న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ప్రకంపనలు రేపిందని, 1969 పోరాటం వైఫల్యం వల్ల తెలంగాణ ప్రజలలో రాజకీయ నాయకత్వంపై అవిశ్వాసం చోటు చేసుకుందన్నారు. పదవుల కోసం తెలంగాణ డిమాండును తాకట్టు పెడతారనే అభిప్రాయం బలపడిపోయిందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథసారధి కె.చంద్రశేఖర్ రావు తమ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయటంతో పాటు శాసన సభ్యత్వానికి సైతం రాజీనామా చేయడం ద్వారా నూతన విశ్వాసాన్ని ప్రజల్లో పాదుకొల్పారని గుర్తు చేశారు. తొలి అడుగులోనే కరీంనగర్ లో జరిపిన సింహగర్జన సభ విజయవంతమై తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు ప్రజల్లో ఉన్న మద్దతును చాటిచెప్పిందన్నారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విశేషమైన ఫలితాలను సాధించడంతో పార్టీ రాజకీయంగా బలపడడానికి బాటలు పడ్డాయని తెలియజేశారు.

అనతికాలంలో జాతీయస్థాయికి తెలంగాణా డిమాండ్

అహింసాయుతంగా, శాంతియుత పంధాలో ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రక్రియను సైతం పోరాట రూపంగా మలుచుకున్నదని, 2004లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ఒప్పందం చేసుకున్న టిఆర్ఎస్.. ఆనాడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యుపిఎ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్పించగలిగిందని, పార్లమెంటులో రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోనూ ఈ విషయాన్ని పలికించిందని, అనతికాలంలోనే ఈ అద్భుతమైన విజయాన్ని టిఆర్ఎస్ సాధించిందన్నారు. దేశంలోని 32 పార్టీలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించి లేఖలు రాయించిందని, ఈ కృషి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమైన మలుపు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఆనాటి యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అనుసరిస్తున్న సాచివేత ధోరణిని నిరసిస్తూ, కెసిఆర్ తమ కేంద్ర మంత్రి పదవికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికను సృష్టించారు. ఈ ఎన్నికలో 2 లక్షల 50 వేల మెజార్టీతో కెసిఆర్  విజయం సాధించడం ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని గుర్తు చేశారు. అనేకమార్లు పదవీ త్యాగాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎన్నికల ద్వారా ప్రజల నిర్ణయాన్ని ప్రకటింపచేసినా, నాటి కేంద్ర ప్రభుత్వం ఉపేక్ష ధోరణినే అవలంబించిందన్నారు.

చారిత్రాత్మక నిరాహార దీక్ష తెలంగాణా ప్రకటన

కేంద్రం వైఖరితో విసిగిపోయిన కెసిఆర్ తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో.. అని భీషణ ప్రతిజ్ఞ చేస్తూ 29 నవంబర్ 2009న చారిత్రాత్మక నిరాహార దీక్షను ప్రారంభించారు. చావు నోట్లో తలపెట్టి కెసిఆర్ చేస్తున్న దీక్ష రాష్ట్రాన్ని అట్టుడికింపచేసిందని, దీక్షకు మద్దతుగా యావత్ తెలంగాణ ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు, యూనివర్సీటీలు యుద్ధ మైదానాలైనాయని, విద్యార్థులు బలిదానాలకు పాల్పడ్డారన్నారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ సంఘీభావంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. కెసిఆర్ దీక్షా బలం చూసి ఢిల్లీ పీఠం గడగడ వణికిందని, 2009 డిసెంబర్ 9 నాడు ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్ల ప్రకటించడం టీఆర్ఎస్ పార్టీ సాధించిన మహోన్నత విజయమన్నారు.

స్వరాష్ట్ర స్వప్నం సాకారం

కేంద్ర నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు కుయుక్తులు పన్నిన సమైక్య రాష్ట్ర పాలకులు కుహనా ఉద్యమాన్ని కృత్రిమంగా నడిపించారు. కేంద్రం కొంత వెనుకడుగు వేసి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చర్యను నిరసిస్తూ 2009 నుండి 2014 వరకు ఐదేళ్ళ పాటు టీఆర్ఎస్ పార్టీ పటుతరమైన పోరాటాన్ని దిక్కులు పిక్కటిల్లేలా సాగించింది. అంతకంతకూ తీవ్రమవుతున్న పోరాట శక్తిని గమనించిన యుపిఎ ప్రభుత్వం.. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు కదిలింది. సమైక్య పాలకులు పన్నిన అన్నిరకాల కుట్రలను ఛేదిస్తూ కెసిఆర్ గారు చూపించిన వ్యూహ చతురత ఫలితంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయింది. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకరమైంది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఉద్యమ సారథిగా కెసిఆర్ ప్రదర్శించిన పోరాటపటిమను, వ్యూహ చతురతను యావత్ ప్రపంచం కొనియాడింది.

తెలంగాణా పునర్నిర్మాణం అద్భుత ఆవిష్కరణలు

2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను కెసిఆర్  భుజస్కందాలపై మోపారు. ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం, ఏడు పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీపడుతూ, అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం.

రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి అంతా అస్పష్టంగా, గందరగోళంగా ఉంది. అన్నిరంగాలలో వెనుకబాటుతనం అలుముకొని ఉంది. తెలంగాణా ప్రభుత్వం అస్పష్టతలను చేధిస్తూ, ఆదాయ, వ్యయాలను ఆకళింపు చేసుకుంటూ, నూతన రాష్ట్రానికి తగిన విధానాలను అవలంబిస్తూ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసింది. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంధాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను, ఆశించిన సమయంలోనే సాధించింది. దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర మేధోమధనం ఉంది. రేపటి అవసరాలకు తగినట్లు నేడే ఆలోచించగలిగిన దార్శనికత ఉంది. రాబోయే సమస్యలను పసిగట్టి పరిష్కార మార్గాలను ముందే సిద్ధం చేసిన దూరదృష్టి ఉంది.

ఉద్యమ దశ, రాష్ట్ర ఆవిర్భావం, స్వరాష్ట్రంలో సాధించిన ఎనలేని ప్రగతి ఇదంతా మన కళ్లముందే ఆవిష్కృతమైన ఒక అద్భుత చరిత్ర, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నింటిని చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచింది. అభి వృద్ధిలో కొత్తపుంతలు తొక్కింది. సంక్షేమంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ విషయంలో ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయి. వారి చల్లని దీవెనలతోనే నేడు తెలంగాణ అభ్యుదయ పథంలో దూసుకుపోతున్నది.
దీర్ఘ దృష్టితో రూపొందిన ప్రణాళికతో పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలన కొనసాగించటం వల్ల తెలంగాణా ఏడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది.

రాష్ట్రం ఏర్పడిన నాడు 2018-2014 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 12 వేల 128 రూపాయలు ఉండగా నేడు తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుంది. నేడు మన దేశ తలసరి ఆదాయం 1 లక్షా 28 వేట 829 రూపాయలుగా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం.

సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలో తెలంగాణ కునారిల్లి పోయింది. రాష్ట్రం అవతరించిన స్వల్ప వ్యవధిలోనే టీర్ఎస్ ప్రభుత్వం 24 గంటలపాటు విద్యుత్తును నిరంతరాయంగా అన్ని రంగాలకు సరఫరా చేయగలగటం దేశం యావత్తు నివ్వెర పోయేలా విధంగా సాధించిన అద్భుతం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదేళ్లలోనే తాగు నీటి కష్టాలను తీరుస్తా నని, లేనిపక్షంలో ఓట్లు అడగనని శపథం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పని చేసి మిషన్ భగీరథ పథకా న్నివేగంగా పూర్తి చేసింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకి శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటిం టికీ నల్లాల ద్వారా అందుతున్నాయి.

రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ అంతమయిందని, కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్ బారిన పడటం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. మిషన్ భగీరథ పథకం నల్గొండ ఫ్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడింది.
నేడు రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని వీధుల్లో కనిపించిన దాఖలాలు లేవు. అతిసారతో ఆదివాసీల మర ణాలు లేవు. శాసన సభలో తాగునీటి కోసం చర్చలు లేవు. నిరసనలు అంతకన్నా లేవు. దేశం మొత్తం మీద తాగు నీటి సమస్యను సంపూర్ణంగా అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది.

హరితహారం

భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉన్నప్పుడే వాతావరణ సమతౌల్యం ఏర్పడుతుంది. కానీ మానవ తప్పిదాల వల్ల నేడు అడవులు నశించి గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారి స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతున్నది. చెట్ల శాతం తగ్గిపోయి తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చి హరిత తెలంగాణను నిర్మించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నది. భూమిపై పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతూ చేస్తున్న అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.

ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అడవుల పునరుద్ధరణను పెద్ద ఎత్తున చేపట్టింది. 2015 సంవ త్సరం నుంచి 9 లక్షల 65 వేల ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా 10 లక్షల 50 వేల ఎకరాల ఆరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకున్నది.

హరితహారం ప్రజల భాగస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నది. నగరాల్లో, పట్టణాల్లో ఆర్బన్ పార్యులను బాగా అభివృద్ధి చేస్తున్నది. పల్లె ప్రగతిలో గ్రామసీమల్లో చెట్లను నాటటం, పెంచడం విరివిగా జరిపిస్తున్నది. మొక్కల సంరక్షణకు అధికారులను, ప్రజాప్రతినిధులను బాధ్యులుగా చేసింది. నేడు గ్రామాల్లో, పట్టణాల్లో, అడవుల్లో పెరిగిన పచ్చదనం కనువిందు చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన నాటితో పోల్చితే రాష్ట్రంలో పచ్చదనం 3.07 శాతం మేర పెరి గిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది.

భాషా సంస్కృతుల పరిరక్షణ

తెలంగాణ ఉద్యమానికి ప్రబలమైన సాంస్కృతిక కోణం ఉంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల భాష ముస్మృతి అవహేళనకు, నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ భాషా, సంస్కృతుల అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటే విధంగా అనేక చర్యలు చేపట్టింది. బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర పండుగలుగా జరుపుతున్నది. బతుకమ్మ పండుగ నేడు ఖండాంతరాలలో నిర్వహించబడుతున్నది. తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తం అవుతున్నది. తెలంగాణ భాషకు గౌరవం
ఒకప్పుడు తెలంగాణ భాష సినిమాల్లో విలన్లకు ఉండేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News