Tuesday, January 21, 2025

‘ఉక్కు’ బంధం ఏనాటిదో…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : విశాఖ ఉక్కు తో తెలంగాణకు ఉన్న బంధం ఈనాటిది కాదు. అప్పట్లో తెలుగు సోదరులు ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు‘ అని నినదిస్తే, దానిలో తెలంగాణ ప్రజలు గొంతు కలిపారు. లక్షలాదిమంది రోడ్లమీదకు వచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. జగిత్యాలలో జరిగిన ఫైరింగ్‌లో ఇద్దరు మరణించారు. తెలంగాణ వ్యాప్తంగా వందలాదిమంది పోలీస్ ఫైరింగ్‌లో, లాఠీచార్జీలో గాయపడ్డారు. దీంతోపాటు వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్ధతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, కార్యక్రమాలు జరిగాయి. న్యాయమైన ప్రజా ఉద్య మం ఎక్కడ జరిగినా దానికి సంఘీభావంగా నిలబడడం తెలంగాణ మట్టికి ఉన్న గుణమని, చరిత్ర తెలవకుండానే చాలామంది తెలంగాణ పై అవాకులు, చెవాకులు పాల్పడడం విడ్డూరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పట్లో విశాఖ ఉక్కు ఫాక్టరీ గురించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు నిరసనగా ఆంధ్ర మంత్రివర్గ సభ్యులు కేంద్రంలోని ఆంధ్ర మం త్రులు రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాల ఓయూ విద్యార్థులు 9 మంది, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన 6గురు విద్యార్థులు సచివాలయం ఎదుట నిరాహార దీక్ష చేశారు. అప్పట్లో ఇచ్చిన ఆంధ్రబం ద్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలసలోనూ, వరంగల్‌లోనూ ప్రదర్శకులపై పోలీసులు కాల్పులు జరపడంతో పాటు కరీంనగర్, కర్నూలు పట్టణాల్లో బాష్పవాయువును ప్రయోగించారు.

క్లిప్పింగ్‌లను షేర్ చేసిన రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆర్‌టిసి బస్సులను పలుచోట్ల ఆపివేయడంతో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక వరంగల్ జిల్లాలో 700ల మంది విద్యార్థులు సామూహిక నిరాహార దీక్ష చేయగా, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని విద్యార్థి ఉక్కు కార్యాచరణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు జంట నగరాలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు సైతం నిరాహార దీక్ష చేశారు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ అప్పట్లో పలు మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ వాటి తాలుకూ క్లిప్పింగ్‌లను ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ఆ ఫొటోలన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News