Friday, December 20, 2024

సంక్షేమ పథకాల్లో తెలంగాణ మొదటి స్థానం

- Advertisement -
- Advertisement -
  • క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి,రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

కొల్చారం: కొల్చారం మండల బిఆర్‌ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత దాగి ఉందని, సౄజనాత్మకతను వెలిగి తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశంలో 25 యువత ఉన్నారని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, సంతోషం క్రికెట్ కిట్ల వేడుకలకు పెద్ద ఎత్తున యువత రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సమాజంలో అందరికీ సేవాగుణం కలిగి ఉండాలని సంతోష్ రావు మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీలకు క్రికెట్ కిట్లను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్. మండల పరిషత్ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్, జడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుక్కాపురం ఆంజనేయులు, ఘనాపూర్ సొసైటీ డైరెక్టర్ నర్సింలు, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డిసి ఎంఎస్ వైస్ చైర్మన్ అరిగి రమేష్, రవితేజ రెడ్డి, కరెంటు ఉమాదేవి రాజా గౌడ్, నాగూరి మనోహర్, కొమ్ముల యాద గౌడ్, గడ్డమీది నర్సింలు, మన్నే శ్రీనివాస్, గంగాపురం నరసాగౌడ్, ఆదామ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News