Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఎంపిపి మృతి…

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident in Chittoor

కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మండలంలోని తేలప్రోలు గ్రామానికి చెందిన ఎంపిపి పులపాక ప్రసన్నకుమారి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి ప్రసన్నకుమారి తన భార్తతో కలిసి బైక్ పై వెళుతుండగా.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రసన్న కుమారి తీవ్రంగా గాయపడింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రసన్నకుమారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Telaprolu MPP Died in Road Accident in Krishna District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News