Wednesday, January 22, 2025

36 లక్షల మొబైల్ నెంబర్లు కట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః దేశంలో ఫోన్‌కాల్స్ మోసాల ఆటకట్టుకు వాట్సాప్ తగు విధంగా సహకరిస్తోందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాల్స్ ఫ్రాడ్ స్కామ్‌ను నివారించేందుకు ఇప్పటికే వాట్సాప్ సంస్థ దాదాపుగా 36 లక్షల మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని టెలికం విభాగం తరువాత సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో మంత్రి తెలిపారు. సెల్‌ఫోన్ల ద్వారా తప్పుడు కార్యకలాపాలకు దిగుతున్నట్లు అనుమానాలు ఉన్నట్లయితే ఈ విషయాన్ని తెలియచేయడం జరిగితే వెంటనే వాట్సాప్‌లో ఈ ఫోన్లను బ్లాక్ చేయడం జరుగుతోంది.

సంబంధిత విషయంపై పూర్తిగా సహకరించేందుకు మెటా సారథ్యపు వాట్సాప్ అంగీకరించి ముందుకు వచ్చి, సహకరిస్తోందని మంత్రి వెల్లడించారు. ఫోన్లు పొగొట్టుకుంటే జాడ తెలిపే విధంగా టెలికం శాఖ సంచార్ సాథీ పోర్టల్‌ను ఆరంభించింది. ఇప్పుడు మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ సర్వసాధారణం, విడదీయలేని బంధం అయింది. ఏదో ఒక సందర్భంలో ఈ ఫోన్లు పోగొట్టుకుంటే పరిస్థితి అగమ్యగోచరం అవుతోంది. ఈ దిశలో ఇప్పుడు పోయిన ఫోన్లను బ్లాక్ చేయడం లేదా, వీటిని రికవరీ చేయడానికి సంబంధించి సత్వర ప్రక్రియ వేదికగా ఈ సంచార్‌సాథీని ఆరంభించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News