Monday, January 20, 2025

పోటీ పరీక్షలు, విద్య, ఉద్యోగ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూప్

- Advertisement -
- Advertisement -

Telegram group for competitive exams education job information

మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర స్దాయి, జాతీయ స్దాయిలో పోటీ పరీక్షలకు సిద్దమైతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి జి. ఆశన్న తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రతి రోజు ఉద్యోగ నోటిఫికేషన్లు, రాష్ట్ర, కేంద్ర స్దాయిలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు దాదాపు 100 ప్రశ్నలు నిధి పంపిస్తారు. మోటివేషనల్ స్టోరీస్ పంపించనట్లు వెల్లడించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈగ్రూపులో వెంటనే జాయిన్ అవ్వండి.. ఈటెలిగ్రామ్ గ్రూపులో నిరుద్యోగ అభ్యర్ధులు ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి అభ్యర్థులు అందరు కూడా చేరవచ్చన్నారు. ఈటెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వడానికి మొదటి ప్రతి అభ్యర్థి ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మొబల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత టిఎస్ బిసీ స్టడి సర్కిల్ కింద లింకు ద్వారా జాయిన్ కావాలని తెలిపారు. తదిపరి వివరాలకు 040-27077929 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News