Saturday, December 21, 2024

‘టెలిగ్రామ్ యాప్’ కఠిన నిర్ణయాలు! యూజర్ డేటా షేర్ చేయనున్నది!!

- Advertisement -
- Advertisement -

సోషల్ యాప్ ‘టెలిగ్రామ్’ లో సమస్యాత్మక కంటెంట్ ను తొలగించేదుకు సిద్ధమవుతున్నట్లు ఆ కంపెపీ వ్యవస్థాపకుడు పావెల్ దరోవ్ వెల్లడించారు. నిబంధనల్ని మరింత కఠినంగా మారుస్తామన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే యూజర్ల వివరాలు ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది కృత్రిమ మేధస్సును ఉపయోగించి సమస్యాత్మక కంటెంట్ లను తొలగించబోతున్నట్లు తెలిపారు. స్నేహితులకు సందేశం పంపడం, వార్తా ఛానెల్ లను అనుసరించడం వంటి ప్రయోజనాలకే టెలిగ్రామ్ యాప్ తీసుకొచ్చినట్లు దురోవ్ తెలిపారు. అయితే చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కాదని స్పష్టం చేశారు. ఎవరైనా సమస్యాత్మక కంటెంట్ ను యాక్సెస్ చేయడం లేక షేర్ చేయడం వంటివి చేస్తే ఆ వ్యక్తుల ఫోన్ నంబర్లు, ఐపి అడ్రస్ లను సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

టెలిగ్రామ్ యాప్ దుర్వినియోగాన్నిఅడ్డుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఇటీవల పారిస్ విమానాశ్రయంలో ఈ ఏడాది ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. 2021లో ఫ్రెంచ్ పౌసత్వం తీసుకున్నారు. ఆయన రూపొందించిన టెలిగ్రామ్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News