Friday, December 20, 2024

రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పండి

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేటలోని రైతు వేధిక భవనంలో సోమవారం టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని అనుచిత వాఖ్యలు చేసినందుకు నిరసనగా రైతులతో చర్చ వేధిక నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగాన్ని పాలకులు నిర్లక్షం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు విద్యుత్ సరఫరా చేయకుండా ఇబ్బందుల పాలు చేసిందని, ఎరువులు, సాగు నీరు అందకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.

రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలన్న రేవంత్‌రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వాల పాలనలో రైతులు ఎరువుల కోసం షాపుల వద్ద చెప్పుల వరుసలు క్యూలైన్‌లో పెట్టి కాపలా ఉండాల్సిన పరిస్దితులు ఉండేవని, ఇప్పుడు రైతులకు ఎరువుల సమస్య లేకుండా సీఎం కేసీఆర్ చేశాడని అన్నారు.

సాగు నీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి తొందరగా పూర్తి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని , రైతులను ఆదుకునేందుకు గాను రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టాడని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో చెరువుల్లో మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీత చేపట్టడం జరిగిందని, దీని వల్ల రెండు పంటలకు సాగు నీరు అందుతుందని ఆయన అన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు మండలాలలో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించి రెండు పంటలు పండేలా ప్రభుత్వం పాటు పడుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతుబంధు జిల్లా కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, సహకార సంఘం అద్యక్షులు కాసనగొట్టు లింగన్న, బెడద సురేష్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, ఎంపీటీసీ ముత్తె రాజన్న, రైతుబంధు డైరెక్టర్లు మోటపలుకుల సత్తయ్య, రమణ, బీఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బండారి మల్లేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News