- Advertisement -
న్యూఢిల్లీ : రాజద్రోహ చట్టంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. నిజం మాట్లాడటం దేశభక్తి అవుతుందని అన్నారు. నిజం చెబితే ఎంతమాత్రమూ దేశద్రోహం కాదని పేర్కొన్నారు. నిజం చెప్పడమంటే దేశాన్ని ప్రేమించినట్టేనని, దేశద్రోహం కాదని, సత్యాన్ని వినడం రాజధర్మమని, సత్యాన్ని అణచివేయడం అహంకారమంటూ రాహుల్ పరోక్షంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు.
- Advertisement -