Sunday, January 19, 2025

సీనియర్ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్‌(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందూతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్త చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

1943 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన చంద్రమోషన్ తెలుగులో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు.

ఆయన కెరీర్ తొలి నాళ్లలో హీరోగా చాలా సినిమాల్లో నటించి అలరించారు. శ్రీదేవీ, జయప్రద, జయసుధ, సుహాసినీ, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చంద్రమోహన్ హీరోగా నటించారు. తర్వాత హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన తన సినీ ప్రయాణంలో మొత్తం 932 సినిమాలు చేశారు.

‘పదహారేళ్ల వయసు’, ‘సిరిసిరి మువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్లులు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ కమెడీయన్ గా చంద్రమోషన్ నంది అవార్డు గెలుచుకున్నారు. పలు తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు. తన సినీ కెరీర్ లో రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News