Thursday, January 23, 2025

కళ్లు తిరిగి పడిపోయిన నటుడు నాగశౌర్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: షూటింగ్ సందర్భంగా నటుడు నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. యూనిట్ సభ్యులు వెంటనే అతడిని ఎ.ఐ.జి. ఆసుపత్రికి తరలించారు. సినిమాకు సంబంధించిన ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తు న్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. నాగశౌర్య వివాహం ఈ నెల 20న బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో ఉంది. అటు వివాహపు పనులు, ఇటు షూటింగ్లతో బిజీగా ఉన్న ఆయనకు విరామం లేకపోవడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ను ప్రశ్నించినప్పుడు డిహైడ్రేషన్ కారణంగా పడిపోయాడని తెలిపారు. పైగా నాగశౌర్యకు 105 డిగ్రీల జ్వరం కూడా ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News