Friday, November 15, 2024

మస్తాన్‌వలీ మళ్లీ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Telugu Akademi scam latest news
‘గిడ్డంగుల’ ఎఫ్‌డిల కేసులో 14 రోజుల రిమాండ్

హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గల్లంతు కేసులో నిందితుడు మస్తాన్ వలీని తాజాగా గిడ్డంగుల శాఖ ఎఫ్‌డిల కేసులో సిసిఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్ఖకు చెందిన రూ. 3.98 కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు యత్నించిన కేసులో మస్తాన్‌వలీని అరెస్ట్ చేశామని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు భూపాల్ తెలిపారు. ఈక్రమంలో తెలుగు అకాడమీ కేసులో శుక్రవారం బెయిల్‌పై విడుదలైన మస్తాన్ వలీని శనివారం నాడు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఒకవైపు తెలుగు అకాడమీ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే ఈ కేసులోని కీలక నిందితుడు, యూనియన్ బ్యాంక్ మాజీ మేనేజర్ మస్తాన్ వలీని మరోవైపు రాష్ట్ర గిడ్డంగుల శాఖ నిధుల కాజేసేందుకు యత్నించిన కేసులో ఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 3 కోట్ల 98 లక్షల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు మస్తాన్‌వలీపై సిసిఎస్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన నగదును కార్వాన్‌లోని యూనియన్ బ్యాంకులో గతేడాది జనవరిలో రెండు వేర్వేరు డిపాజిట్లుగా చేశారు. ఆ సమయంలో మేనేజర్‌గా ఉన్న మస్తాన్ వలీ, ఏడాది వ్యవధికి డిపాజిట్లు చేసి నకిలీ రసీదులు ఇచ్చారు. అసలు పత్రాలను మాత్రం వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చారు. కాలపరిమితి తీరడంతో గిడ్డంగుల సంస్థ ప్రతినిథులు రసీదులను తీసుకొని బ్యాంకుకు వెళ్లగా అధికారులు నకిలీవిగా తేల్చారు. డిపాజిట్ డబ్బులు మాత్రం బ్యాంకులోనే సురక్షితంగా ఉన్నాయి. దీంతో మోసానికి పాల్పడేందుకు కుట్ర పన్నిన మస్తాన్ వలీని మరింత లోతుగా విచారించేందుక కస్టడీ కోరనున్నారు.

మస్తాన్ ఆస్తులపై విచారణ 

తెలుగు అకాడమీ ఎఫ్‌డిలను కాజేసిన కేసులోని నిందితుడు మస్తాన్‌వలీ కొనుగోలు చేసిన స్థిర,చరాస్థులపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీకి చెందిన రూ. 43 కోట్లను కొల్లగొట్టిన కేసులోనూ మస్తాన్ వలీ నుంచి ఇప్పటి వరకు రూ. 2 కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నామని, అతనికి చెందిన ఇతర ఆస్తులపై ప్రత్యేక దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే తెలుగు అకాడమీ స్కాంలో నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని, మస్తాన్‌వలీతో పాటు మరికొందరు నిందితులు కాజేసిన సొమ్ముతో ఆస్తులు కొన్నారని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు భూపాల్ పేర్కొన్నారు. ఈ కేసులోని ఇతర నిందితులు కొనుగోలు చేసిన ప్లాట్లు, భూములును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ కేసులోని కీలక నిందితుడు మస్తాన్‌వలీ స్థిరాస్తులకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ బ్యాంక్‌లలో ఉంచిన ఎఫ్‌డిలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు భూపాల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News