నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధా న పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్త ంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో యు నానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నే పథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా గర్వంగా ఉన్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది. రాను న్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది’ అని తెలిపారు.. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. బలగం హిట్ త ర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చె ప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్‌గా దీప్తి అక్క, ప్రశాంతి వచ్చారు. మేమంతా రాకెట్‌లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. నాని నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సిని మా, మంగపతి పాత్ర గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శివాజీ అన్న మాకు గొప్ప స్ఫూర్తి ఇచ్చారు. ఈ సినిమాలో నాతో పాటు నటించిన అందరికీ థాంక్ యూ. రోహిణీ, శుభలేఖ సుధాకర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ జగదీశ్, నిర్మాత దీప్తి గంటా, శివాజీ, రోహిణి, శుభ లేఖ సుధాకర్ పాల్గొన్నారు.
‘కోర్ట్’ని తెలుగు ప్రేక్షకులు గెలిపించారు: నాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -