Monday, December 23, 2024

అమెరికా కోర్టు జడ్జీగా తెలుగు మహిళ…తెలుగులో ప్రమాణస్వీకారం!

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా: అమెరికాలో తెలుగు మహిళ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జీగా నియమితులయ్యారు. విశేషమేమిటంటే ఆమె తన మాతృ భాష అయిన తెలుగులో స్వాగతోపన్యాసం…చివరన ‘అసతోమా…’అనే అనే సంస్కృత ప్రార్థనతో ముగిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె విజయవాడలో జన్మించారు. ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఆమె ఉస్మానియా యూనివర్శిటీ పూర్వ విద్యార్థిని కూడా.  అంతేకాదు ఆమె జయ తండ్రి బాడిగ రామకృష్ణ 2004 నుంచి 2009 వరకు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News