Wednesday, January 22, 2025

కెన్యాలో స్కేటింగ్ పోటీలో తెలుగు కుర్రోడి ఘనత

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన గిన్నారపు దేవేందర్ మేనకల కుమారుడు సైలాస్ కెన్యా దేశంలో కాసరాని స్టేడియంలో ఆదివారం జరిగిన 2వ జాతీయ స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో అండర్ 11(300) మీటర్లలో కౌశ్య పథకం సాధించి మరోసారి తెలుగు కుర్రాడి ప్రతిభను చాటుకున్నాడు.

గత సంవత్సరం జరిగిన వివిధ స్కేటింగ్ పోటీల్లో ఈ కుర్రాడు ఘనత సాధించాడు. ఈ సందర్భంగా కోచ్ మరియో మాట్లాడుతూ గత ఏడాది చెప్పినట్లే కైలాసను జాతీయ క్రీడాకారిగా చూడాలన్న కోరిక నెరవేరింది. నల్ల జాతీయులను ఓడించడం అంటే సైలాస్ లాంటి వారికే సాధ్యమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కెన్యా దేశంలో తొలి భారత పౌరునిగా కాంస్య పథకం సాధించిన ఘనత సైలాస్‌కే దక్కిందన్నారు. ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులు, మిత్రులు సంబరాల్లో మునిగిపోయారు. మాకు చాలా సంతోషంగా ఉందని మా గ్రామానికి ఇంకా ఎంతో మంచి పేరు తీసుకరావాలని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News