Wednesday, April 2, 2025

ఇక పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఐబీ సహా అన్ని
పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్ట్‌గా తెలుగు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అ న్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఐబి సహా ఇ తర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా పేర్కొంటూ మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026 27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై అన్ని సిలబస్‌కు సంబంధించిన పా ఠశాలల్లో తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ కింద ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News