Sunday, January 12, 2025

తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలి

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య పిలుపునిచ్చారు. ఆదివారం చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామంలోని బీవైజీ గార్డెన్‌లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్ట రజనీకాంత్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ బండి పుల్లయ్య హాజరై మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త సైనికుల వలే పనిచేస్తూ తెలుగు దేశం పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పునికి పుచ్చుకొని విజన్ ఉన్న నేతగా నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందినట్లు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్‌ని ప్రజలు తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పోటీచేసి మెజార్టీ స్థానాలు గెలుచుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీని మరింత బలపర్చి గెలుపే లక్షంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, బత్తిని ఎల్లాగౌడ్, ముంజ వెంకట్రాజ్యంగౌడ్, చెల్లేటి కృష్ణారెడ్డి, రాపర్తి యాకయ్య, మాదిరెడ్డి ధర్మారెడ్డి, కనుకాచారి, కలకోట రమేశ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News